చేసేదెవరు చేయెంచేదెవరు
చేసేవాడికి చెయ్యమని చెప్పనవసరం లేదు చేయనివాడికి వాడు ఎంత చూపిన చెయ్యడు చేసి చేయని వాడు కొంత సాయం చేస్తే చేయగలడు చేసేవాడుగాని, చేయనివాడు గాని, లేదా చేసి చెయ్యని వాడు గాని ఎవ్వరు అధికం గాని, అల్పం గని గాదు. అది వారి గుణం. చేసేవాడు చేసిన ఫలితం చిత్తగించినా! చెయ్యని వాడు ఆ ఫలితం చిత్తగించకపోయెనా ! చేసి చేయని వాడు ఆ ఫలితం యొక్క చింతన లేకపోయినా ఏ ఒక్కరు ఆ కార్యం కి గాని ఆ ఫలితం కి గాని ఎవరు కాదు మనం నిమిత్తాపపర్తులం, ఆ భగవంతుని చేతిలో తోలు బొమ్మలం అ కార్యాన్ని చేయదలిచిన వాడు గాని, చేయెంచే వాడు గాని, చెయ్యమన్నా వాడు గాని అ కార్యం ఫలాన్ని గాని, ఫలితం గాని, మరియు ప్రతి ఫలితం గాని అంతా! అంతా!....... అ నా చిరు మందహాసుడివైనా............ నా చిన్నారి కృష్ణుడే గురు కృప: కృష్ణకనౌస్